Skip to product information
Advaitha Premakavyam(Spiritual Musings) | అద్వైత ప్రేమకావ్యం

Advaitha Premakavyam(Spiritual Musings) | అద్వైత ప్రేమకావ్యం

Rs. 250.00

Author : Vamsi Krishna

Advaitha Premakavyam by Vamsi Krishna
Spiritual Poems and Musings

ఈ పుస్తకాన్ని నేను రాస్తాననుకోలేదు. రాయాల్సి వచ్చింది. ఇందులో అన్ని రకాల అంశాల గురించి క్లుప్తంగా - మర్మంగా వివరించే ప్రయత్నం చేశాను. ఆ వివరణ అసంపూర్ణంగా కూడా అనిపించచ్చు, కానీ కొన్నిసార్లు అసంపూర్ణతలోనే పరిపూర్ణత దాగి ఉంటుంది. అది సూక్ష్మదృష్టితో చూస్తే తప్ప అర్థంకాదు. ఈ పుస్తకం ద్వారా ఆ పూర్ణదృష్టిని పెంపొందించే ప్రయత్నం చేశాను.
ఈ కవితలలో ఉన్న విరహాన్ని- భావాన్ని ఎవరు ఎలా అయినా అర్థంచేసుకోవచ్చు. కానీ, ఈ కవితలలో ఉద్దేశ్యం మాత్రం- స్త్రీ అయినా పురుషుడైనా వారు దేహ సంబంధిత గుర్తింపులు కాదు, మొదట వారు చైతన్యం అను విషయాన్ని గుర్తుచేయటానికే. ఆ విషయాన్ని మరిచిన వారి అస్తిత్వం, మరలా ఆ స్థితిని చేరుకోవటానికి కలవరించే కలతలే ఈ కవితలు. ఇందులోని కథలలో ఉన్న ప్రశ్నలు - విమర్శలు, జవాబులు - సమాధానాలు అన్నీ కూడా నా సత్సంగాల్లోని ప్రజల అయోమయాల నుంచి జన్మించిన అంశాలు. ప్రజల్లోని ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సామాజిక విప్లవాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో చేస్తున్న ఈ యుద్ధంలో, నాకు ఎదురైన పరిస్థితులకు ప్రతిబింబాలు ఈ కథలు. ఏదో సాదాసీదాగా కాలక్షేపం కోసం జీవితం గురించి - దైవం గురించి రాసిన రాతలు కావు ఇవి. ప్రజల్లో పేరుకుపోయిన అజ్ఞాన సామ్రాజ్యాన్ని పునాదులతో సహా బద్దలు చేయటానికి కంకణం కట్టుకున్న నా జీవిత ఆశయం ఈ పుస్తకం. ప్రజల్లోని జ్ఞానజ్యోతిని వెలికితీయాలని మొదలైన ప్రజా జీవితంలో ఒక అధ్యాయమే ఈ ‘అద్వైత ప్రేమకావ్యం’.

-వంశీకృష్ణ

You may also like