
'A' Telugu Stories | 'A' తెలుగు కథలు
Author : Chilukuri Rama Umamaheshwara Sharma
A- చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు. కథకి విస్తరణ పరిమితి, నిర్మాణ క్రమం— ఉత్కంఠ ఎత్తుగడ, రచనాచాపం, నిర్దిష్ట నిలుపు; ఈ కొలబద్దలకి ఆవల నేను . జీవితంలో కూడా!
ఏదో ఒక విషయం తీసుకోవడం , దాన్ని చదివేలా, కించిత్ రసవత్త తరంగా కాగితం మీద పెట్టడం. పుట్టుుపూర్వోత్త తరాలు కాకపోయి నా దానిమీద ఎంతోకొంత అవగాహన. ఆ క్రమంలో మీతో కాస్సేపు నడక. అదో ఆనందం! మిగిలిన విషయాలు, నిర్ణణయాల్లాంటివి— మీకే.
మొదటిసారి చదివినప్పుడు అర్థమయి కానట్టుగా ఉండచ్చు కథలు కొన్ని. చక్కరకేళీ ఒలిచి చేతిలో పెట్టలేను . కొంత శ్రమైక సాహచర్యం ఆశిస్తాను మీనుంచి, ప్రమోద మధనానికి.
పలు భాషాకోవిదుణ్ణి కాను — తెలుగులోనే. నాకు తెలిసిన భాషే నా కథల్లో కూడా.
చివరిగా— నా పాత్రలు నేను చెప్పినట్టు మాట్లాడవు. వాళ్ళు చెప్పేదే రాస్తాన్నేను.
ఇప్పపటికింతే — కథల్లో కలుద్దాం.
చిలుకూరి రామ ఉమామాహేశ్వర శర్మ