
Kalavapudi Kathalu | కలవపూడి కథలు
Author : Samba Shiva Thadavarthi
Kalavapudi Kathalu - Collection of Short Stories by Samba Shiva Thadavarthi
అప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.
ఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.
- మీ సాంబశివ