Aju Publications
Gangaraajam Bidda | గంగరాజం బిడ్డ
Gangaraajam Bidda | గంగరాజం బిడ్డ
Couldn't load pickup availability
Author Name : Poodoori Rajireddy
Gangaraajam Bidda | Collection of Short Stories
by Poodoori Rajireddy
“మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.”
“మనసు అనేది తక్షణ, సుదూర జ్ఞాపకాల మైదానం. అక్కడి ఆటే సాహిత్యానికి మెటీరియల్ అవుతుంది. కాకపోతే, కలల్లో కొత్త ఉనికిని సంతరించుకున్నట్టుగానే, సాహిత్యంలోనూ వాస్తవ జీవితం తన రూపును మార్చుకోవచ్చు. అయితే, సాహిత్యం దానికదే ముఖ్యమే అయినా, జీవితం తన అనుభవాలతో ఇచ్చే తీవ్రతలో ఇది ఏమంత ప్రాధాన్యం ఉన్నది కాదు. అలాంటప్పుడు మరెందుకు రాస్తాం? ఏమో! ఏ జవాబు అయినా పేలవమైనదే అవుతుంది. ఆ ‘చెప్పలేనితనం’ మనల్ని చాలా పనులు చేయిస్తుంది. నాతో ఇట్లా కొన్ని కథలు రాయించింది. ఒకటి మాత్రం నిజం; కళారూపం ఏదైనా సరే, అది ఆ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం. ద బెస్ట్! ఈ వచన కళలో భాగం కావడం అనేది నా జీవితంలోని కొన్ని క్షణాలకు అందివచ్చిన సార్థకత.”
Share

