Aju Publications
Gundelo Vaana | గుండెలో వాన
Gundelo Vaana | గుండెలో వాన
Couldn't load pickup availability
వర్తమాన సామాజిక వాస్తవికత ‘గుండెలో వాన’
పెద్దింటి అశోక్కుమార్ తెలంగాణ ప్రాంతం నుంచి తన కాలపు భారతీయ సామాజిక వాస్తవికతను, తనదైన దర్శనం నుండి వాస్తవికంగా కథలుగా నవలలుగా మలుస్తున్న రచయిత. ఆయన వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రవృత్తి రీత్యా కథ, నవల, నాటక, వ్యాస రచయిత. వామ పక్ష ఉద్యమాలతో ఎదిగిన వాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినవాడు. విచారము, అనుభవము, ప్రచారము అనేవి ఏ ఉపాధ్యాయునికైనా అత్యంత ప్రాథమిక లక్షణము. అందులోనూ తను గణితశాస్త్ర ఉపాధ్యాయుడు కాబట్టి సమాజ చలన సూత్రాలను అవపోసనపట్టి తిరిగి వాటిని తన రచనల ద్వారా సమాజానికి అందిస్తుంటారు.
ఇవి 2012 - 18 మధ్యకాలంలో రాయబడిన ప్రపంచీకరణ మూడవ దశాబ్దపు కథలు. ప్రపంచీకరణలో భారతీయ సమాజ చిరకాల సమస్యలు పరిష్కారమౌతాయని ప్రచారాలు ముమ్మరంగా సాగాయి. కానీ అది వాస్తవం కాదని పునాదిలో మార్పు రాకుండా ఉపరితలంలో వచ్చే మార్పులు, కొందరికే ప్రయోజనకరంగా ఉంటాయని ఋజువయింది. ఈ నిజాన్నే అశోక్కుమార్ కథలు ఆధారాలతో ఆవిష్కరించాయి.
Share
