{"product_id":"vipula-chatura-nenu-విపుల-చతుర-నేను-1","title":"Vipula Chatura Nenu | విపుల చతుర నేను","description":"\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eవిపుల, చతుర పత్రికల చేయట్టుకుని అక్షరాలా రెండేళ్ళు నడిచాను. అది చిన్నమాట. మనసును నైవేద్యం చేసుకుని సాకానన్నది అసలు మాట. ఆపై కాలం ఉమిసిన అనేక కారణాల వల్ల వాటి చేయిని విడువక తప్పింది కాదు. ఫలితం... ఊటలా ఉబికొచ్చే జ్ఞాపకాల అడుగుల్లోంచి అప్పుడప్పుడు ఓ అంతర్వేదన పారుతూపారుతూ ఏదో నరాన్ని సొట్ట పడేస్తుండేది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eకరోనా మహమ్మారి చెలరేగి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అనంతరకాలంలో తెలుగు పత్రికాప్రపంచంలో వచ్చిన భారీ మార్పులు, పరిణామాల ఫలితంగానో, ఈనాడులో సంస్థాగతంగా వచ్చిన పోకడల కారణంగానో ‘విపుల’, ‘చతుర’ 2023లో కాలగతిలో కలిసిపోయాయి. ఆ పత్రికలతో ముడిపడిన నా ప్రస్థానం అతి తక్కువ కాలమే అయినా నాకది ఎంతో అమూల్యం, అపురూపం అనే అనుకుంటాను ఎప్పుడూ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003e\u003cmeta charset=\"utf-8\"\u003eఆనాడు విపుల, చతుర మీద ఎంత మనసుపెట్టి పని చేశానో, వాటి గురించిన కెరటాలతో ఈ సాగరాన్ని సృజియించడానికి అంతకు రెట్టింపుగా నన్ను నేను ఒంచేసుకున్నాను. దీని మీద వెచ్చించిన కాలాన్ని నా కవిత్వ రచనకు కైమోడ్పు చేసుకుంటే ఇంకో రెండు కవితా సంపుటాలు ఈపాటికే వచ్చుండేవన్నది వాస్తవం. మరంతగా సాగిన యాగంలో వాస్తవం కాని ఒక్కక్షరమూ మీ కంటిలో నలుసు కాదని భరోసా ఇస్తున్నా.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":47673864749193,"sku":null,"price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/Screenshot2026-07-23at1.03.09PM.png?v=1784803030","url":"https:\/\/ajupublications.com\/products\/vipula-chatura-nenu-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2-%e0%b0%9a%e0%b0%a4%e0%b1%81%e0%b0%b0-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-1","provider":"Aju Publications","version":"1.0","type":"link"}