{"product_id":"oka-nenu-oka-canada-ఒక-నేను-ఒక-కెనడా","title":"Oka Nenu Oka Canada | ఒక నేను– ఒక కెనడా","description":"\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఖండాంతర దేశంలో బతుకెంత బడుగుదైపోతుందో తెలియపరచడం కోసం నా నడకల్ని ఈ దండ నిండా అల్లుకుంటూపోయాను. అదీ, ఎందుకూ అంటే.. కెనడా వెళ్లి స్థిరపడ్డం మీద కొన్నేళ్లుగా మనదేశవాసుల్లో మోజు పెరిగిపోయింది. వాళ్లు సేకరించే అరకొర సమాచారంతో అనేక భ్రమలు, అపోహలు వాళ్ల మదినిండా. వాటిని పటాపంచలు చేసి, ఆ అర్ధవాస్తవాల్ని తుంచేసి నాకనుభవమైన అక్కడి ప్రపంచాన్ని వాళ్లకు పరిచయం చేద్దామనిపించింది. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఆపై ఉల్కలా ఊడిపడే చుక్కల్ని కోసుకోడానికి సిద్ధపడాల్సొస్తుందో, చలువపందిరని అనుకున్న ధరణి మీద సూర్యగ్రహణాల్ని తలపాగాగా చుట్టుకుని తమ చుట్టూ తామే భ్రమణాలు పోవాల్సొస్తుందో తెలుసుకుంటారని, తెలివిమంతులవుతారని తలచీనూ..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eతెలుసుకున్నాకైనా, మనసులోకి ఇంకించుకున్నాకైనా ఆ తెలివిడితో.. ఎగిరిపోవాలో, ఉన్న నేలనే కాళ్లను కొంత బలంగా నాటుకోవాలో తేల్చుకుంటారనే తలంపుతోనూ..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఅదీగాక– కెనడా నుంచి వచ్చేశాక మళ్లీ జంటపత్రికలతో ముడిపడ్డానికి, అది కానప్పుడు ప్రధానస్రవంతిలో మళ్లీ జర్నలిస్టు జీవితాన్ని ఆవహింపజేసుకోడానికి ప్రయత్నాలు సాగించి, విసిగి వేసారి చివరికెలాగో ఆ జీవనాన్ని పొదువుకోడం ‘విపుల, చతుర– నేను’కు కొనసాగింపే, ఒక ముక్తాయింపే కనుక, దాన్నీ పరచడం కోసం.. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఈ పొడిగింపై మీ ముందుకిలా.. మీ ముందిలా.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":46702617755785,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/Screenshot2026-05-11at2.54.45PM.png?v=1778491662","url":"https:\/\/ajupublications.com\/products\/oka-nenu-oka-canada-%e0%b0%92%e0%b0%95-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%92%e0%b0%95-%e0%b0%95%e0%b1%86%e0%b0%a8%e0%b0%a1%e0%b0%be","provider":"Aju Publications","version":"1.0","type":"link"}