{"title":"Non-Fiction","description":null,"products":[{"product_id":"nishiddha-raagaalu-నిషిద్ధ-రాగాలు","title":"Nishiddha Raagaalu | నిషిద్ధ రాగాలు","description":"\u003cp\u003e\u003cmeta charset=\"utf-8\"\u003e\u003cspan\u003eపితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ఎదుర్కునే వివక్ష, ఆమె చుట్టూ ఉండే పరిస్థితులు, తన అస్థిత్వం కోసం ఆమె చేసే పోరాటాన్ని కొందరు సాహితీకారులు రికార్డు చేశారు, చర్చించారు, తమ ఆలోచనలను బాధ్యతగా పంచుకున్నారు. స్త్రీ సమస్యలను, స్త్రీ జీవన స్థితిగతులను విశ్లేషించే క్రమంలో సినీ పరిశ్రమ ఈ సాహిత్యాన్నే ఎక్కువగా ఆధారం చేసుకుంది. ఈ పుస్తకంలో చర్చించిన సినిమాలలో సాహిత్యం నుండి తీసుకున్న కథాంశాలు చాలా ఉన్నాయి. సాహిత్యానికీ, బాధ్యత గల సినిమాకీ మధ్య సమన్వయం ఉంటే ఎంత చక్కని సినిమాలు వస్తాయో ఈ పుస్తక రచనాకాలంలో నేను కనుగొన్నాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eసామాజిక స్పృహతో తీసిన సినిమాలు, బాధ్యతతో నిర్మించిన చిత్రాలు ఏ భాషలో వచ్చినా వాటి కథా మూలాలు ఆ భాషా సాహిత్యంలో కనిపిస్తాయి. సాహిత్యానికి దూరం అయిన సినీ కథా వస్తువు ఎంత నిస్సారంగా ఉంటుందో ప్రస్తుత సినిమాలు చూస్తే తెలుస్తుంది. మహిళా ప్రధాన చిత్రాలంటే మహిళలకు ఎక్కువ నిడివి ఉన్న పాత్రలు ఇచ్చి తీసిన సినిమాలు కావు. తమ అస్థిత్వ పోరాటంలో స్త్రీలు ఎదుర్కునే పరిస్థితులను చర్చించే చిత్రాలు మహిళా చిత్రాలు అవుతాయి. ఈ తేడాను ప్రస్తుత సినీ ప్రేక్షక తరానికి ఎరుకపరచాలనే ఉద్దేశంతో అలాంటి చిత్రాలను వివిధ భారతీయ భాషల నుండి ఎన్నుకుని ఇలా సంకలనంగా తీసుకువచ్చాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e- పి. జ్యోతి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":45726462247049,"sku":null,"price":850.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/NishiddhaRagalu-Front.jpg?v=1776927439"},{"product_id":"mana-kaalam-buddhudu-మన-కాలం-బుద్ధుడు","title":"Mana Kaalam Buddhudu | మన కాలం బుద్ధుడు","description":"\u003cp\u003eనా జీవిత కథను తీసుకురావడానికి అంకితభావంతో కృషి చేసిన డాక్టర్ అరవింద్ యాదవ్కు అభినందనలు. టిబెట్ చరిత్రను, బౌద్ధ తాత్వికతను అర్థం చేసుకోవడంలో అరవింద్ సాగించిన సునిశిత పరిశోధన, లోతైన అధ్యయనం నా ప్రయాణం గురించి, నేను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న విలువల గురించి తెలుసుకోవాలనుకొనే వారికి గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది. బాల్యం నుంచి ప్రవాసందాకా నా జీవనయానాన్ని గ్రంథస్థం చేయడం ద్వారా డాక్టర్ యాదవ్ టిబెట్ ప్రజల ఆకాంక్షలను, చర్చలే సాధనంగా సాగుతున్న వారి అచంచల అహింసా మార్గాన్ని సాధికారికంగా నమోదు చేసినట్టయింది. మానవ విలువలను, మత సామరస్యాన్ని పెంపొందించడంలోనూ టిబెట్ ప్రాంతపు సంస్కృతిని పర్యావరణాన్ని కాపాడటంలోనూ ప్రాచీన భారతదేశ జ్ఞానం పట్ల అవగాహనను, ఆసక్తిని రేకెత్తించడంలోనూ అంకితభావంతో నేను చేస్తున్న కృషికి ఈ పుస్తకం దివిటీ పట్టింది.\u003c\/p\u003e\n\u003cp\u003e-దలైలామా \u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":47701859532937,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/Screenshot2026-07-30at3.41.42PM.png?v=1785408717"},{"product_id":"harappa-mana-puranalalo-charitra","title":"Harappa- Mana Puranalalo Charitra | హరప్పా - మన పురాణాలలో చరిత్ర","description":"\u003cp\u003e\u003cmeta charset=\"utf-8\"\u003e\u003cspan\u003eఆర్యులు ఎవరు?\u003c\/span\u003e\u003cspan\u003eవారు ఎక్కడి నుంచి వచ్చారు? ⁠ ⁠⁠మోహెంజోదారో అసలు పేరు ఏమిటి? ⁠ ⁠⁠దేవాసురులు - నాటి అద్భుత కల్పనలోని పాత్రలేనా? ⁠ ⁠⁠అయోధ్య కాశీ హస్తిన లంక - వాటి నిజమైన ఉనికి ఏదో మనకు తెలుసా? ⁠ ⁠⁠మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇందులో మన భారతీయులకు ఎంతో పరిచయం ఉన్న కథలూ, గాథలూ, భూమి మీద అతిప్రాచీన నాగరికతలలో పెద్దదైన హరప్పానాగరికత నేపథ్యంలో మళ్లీ ప్రాణం పోసుకుంటాయి. రచయిత సాయి పాపినేని మన ఇతహసాలనూ పురాణాలనూ, చరిత్ర, పర్యావరణ, భూగోళ, జన్యు, భాషాశాస్త్రాలలో తాజా అధ్యయనాలతో పోల్చి, అందులోంచి చారిత్రక వాస్తవాలను వెలికితీయడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":48209115250825,"sku":null,"price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/Screenshot2026-08-24at10.36.22AM.png?v=1788114871"}],"url":"https:\/\/ajupublications.com\/collections\/non-fiction.oembed","provider":"Aju Publications","version":"1.0","type":"link"}