{"title":"New Releases","description":"\u003cp\u003eNew Releases\u003c\/p\u003e","products":[{"product_id":"gundelo-vaana-గుండెలో-వాన","title":"Gundelo Vaana | గుండెలో వాన","description":"\u003cp\u003eవర్తమాన సామాజిక వాస్తవికత ‘గుండెలో వాన’ \u003c\/p\u003e\n\u003cp\u003eపెద్దింటి అశోక్కుమార్ తెలంగాణ ప్రాంతం నుంచి తన కాలపు భారతీయ సామాజిక వాస్తవికతను, తనదైన దర్శనం నుండి వాస్తవికంగా కథలుగా నవలలుగా మలుస్తున్న రచయిత. ఆయన వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రవృత్తి రీత్యా కథ, నవల, నాటక, వ్యాస రచయిత. వామ పక్ష ఉద్యమాలతో ఎదిగిన వాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినవాడు. విచారము, అనుభవము, ప్రచారము అనేవి ఏ ఉపాధ్యాయునికైనా అత్యంత ప్రాథమిక లక్షణము. అందులోనూ తను గణితశాస్త్ర ఉపాధ్యాయుడు కాబట్టి సమాజ చలన సూత్రాలను అవపోసనపట్టి తిరిగి వాటిని తన రచనల ద్వారా సమాజానికి అందిస్తుంటారు.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cbr\u003eఇవి 2012 - 18 మధ్యకాలంలో రాయబడిన ప్రపంచీకరణ మూడవ దశాబ్దపు కథలు. ప్రపంచీకరణలో భారతీయ సమాజ చిరకాల సమస్యలు పరిష్కారమౌతాయని ప్రచారాలు ముమ్మరంగా సాగాయి. కానీ అది వాస్తవం కాదని పునాదిలో మార్పు రాకుండా ఉపరితలంలో వచ్చే మార్పులు, కొందరికే ప్రయోజనకరంగా ఉంటాయని ఋజువయింది. ఈ నిజాన్నే అశోక్కుమార్ కథలు ఆధారాలతో ఆవిష్కరించాయి.\u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":46702460076169,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/Screenshot2026-05-01at6.38.04PM.png?v=1778490635"},{"product_id":"marana-grantham-మరణగ్రంథం","title":"Marana Grantham | మరణగ్రంథం","description":"\u003cp\u003e\u003cmeta charset=\"utf-8\"\u003e\u003cmeta charset=\"utf-8\"\u003e‘మౌత్ కీ కితాబ్’ తొలి నవలతోనే ఉర్దూ సాహిత్యంలో పెను సంచలనం సృష్టించి, విశేష పాఠకాదరణ చూరగొన్న రచయిత ఖాలిద్ జావేద్. వందేళ్ళ ఉర్దూ నవలా సాహిత్య సృజనలో ఇదొక మైలురాయి. నేరాలూ ఘోరాలూ చేసి సమాజంలో భ్రష్టుడై Schizophrenia అనే మానసిక వ్యాధి సోకిన ఒక వ్యక్తి చెప్పుకునే కథను ఖాలిద్ అద్భుతమైన ప్రతీకలు, పదచిత్రాలతో కవితాత్మక వచనంలో అనితర సాధ్యమైన శైలిలో రాశారు. ఈ నవలపై ఉపఖండంలో తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. ప్రశంసలూ విమర్శలూ వెల్లువెత్తాయి. తర్వాత ఖాలిద్ రాసిన ‘నేమత్ ఖాన’ నవలకు “The Paradise of Food” పేరుతో వచ్చిన అనువాదానికి ప్రతిష్ఠాత్మకమైన జేసీబీ లిటరేచర్ - 2022 అవార్డు లభించింది. ఆయన మరో రెండు నవలలు, నాలుగు కథా సంపుటాలు, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు వెలువరించారు. దిల్లీ జామియా మిల్లియా ఇస్లామియాలో ఉర్దూ ప్రొఫెసర్గా రిటైరైన ఖాలిద్ పలు అవార్డులు అందుకున్నారు. ‘మౌత్ కీ కితాబ్’ నవలకు తెలుగు అనువాదమే ఈ ‘మరణగ్రంథం.’\u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":46702554087561,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/Screenshot2026-05-11at2.44.51PM.png?v=1778491066"},{"product_id":"vipula-chatura-nenu-విపుల-చతుర-నేను","title":"Vipula Chatura Nenu, Oka Nenu Oka Canada, Set of Two Books | విపుల చతుర నేను, ఒక నేను-ఒక కెనడా, రెండు పుస్తకాల జత","description":"\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003e1. విపుల, చతుర, నేను \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eవిపుల, చతుర పత్రికల చేయట్టుకుని అక్షరాలా రెండేళ్ళు నడిచాను. అది చిన్నమాట. మనసును నైవేద్యం చేసుకుని సాకానన్నది అసలు మాట. ఆపై కాలం ఉమిసిన అనేక కారణాల వల్ల వాటి చేయిని విడువక తప్పింది కాదు. ఫలితం... ఊటలా ఉబికొచ్చే జ్ఞాపకాల అడుగుల్లోంచి అప్పుడప్పుడు ఓ అంతర్వేదన పారుతూపారుతూ ఏదో నరాన్ని సొట్ట పడేస్తుండేది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eకరోనా మహమ్మారి చెలరేగి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అనంతరకాలంలో తెలుగు పత్రికాప్రపంచంలో వచ్చిన భారీ మార్పులు, పరిణామాల ఫలితంగానో, ఈనాడులో సంస్థాగతంగా వచ్చిన పోకడల కారణంగానో ‘విపుల’, ‘చతుర’ 2023లో కాలగతిలో కలిసిపోయాయి. ఆ పత్రికలతో ముడిపడిన నా ప్రస్థానం అతి తక్కువ కాలమే అయినా నాకది ఎంతో అమూల్యం, అపురూపం అనే అనుకుంటాను ఎప్పుడూ. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఆనాడు విపుల, చతుర మీద ఎంత మనసుపెట్టి పని చేశానో, వాటి గురించిన కెరటాలతో ఈ సాగరాన్ని సృజియించడానికి అంతకు రెట్టింపుగా నన్ను నేను ఒంచేసుకున్నాను. దీని మీద వెచ్చించిన కాలాన్ని నా కవిత్వ రచనకు కైమోడ్పు చేసుకుంటే ఇంకో రెండు కవితా సంపుటాలు ఈపాటికే వచ్చుండేవన్నది వాస్తవం. మరంతగా సాగిన యాగంలో వాస్తవం కాని ఒక్కక్షరమూ మీ కంటిలో నలుసు కాదని భరోసా ఇస్తున్నా.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003e2. ఒక నేను, ఒక కెనడా \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఖండాంతర దేశంలో బతుకెంత బడుగుదైపోతుందో తెలియపరచడం కోసం నా నడకల్ని ఈ దండ నిండా అల్లుకుంటూపోయాను. అదీ, ఎందుకూ అంటే.. కెనడా వెళ్లి స్థిరపడ్డం మీద కొన్నేళ్లుగా మనదేశవాసుల్లో మోజు పెరిగిపోయింది. వాళ్లు సేకరించే అరకొర సమాచారంతో అనేక భ్రమలు, అపోహలు వాళ్ల మదినిండా. వాటిని పటాపంచలు చేసి, ఆ అర్ధవాస్తవాల్ని తుంచేసి నాకనుభవమైన అక్కడి ప్రపంచాన్ని వాళ్లకు పరిచయం చేద్దామనిపించింది. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఆపై ఉల్కలా ఊడిపడే చుక్కల్ని కోసుకోడానికి సిద్ధపడాల్సొస్తుందో, చలువపందిరని అనుకున్న ధరణి మీద సూర్యగ్రహణాల్ని తలపాగాగా చుట్టుకుని తమ చుట్టూ తామే భ్రమణాలు పోవాల్సొస్తుందో తెలుసుకుంటారని, తెలివిమంతులవుతారని తలచీనూ..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eతెలుసుకున్నాకైనా, మనసులోకి ఇంకించుకున్నాకైనా ఆ తెలివిడితో.. ఎగిరిపోవాలో, ఉన్న నేలనే కాళ్లను కొంత బలంగా నాటుకోవాలో తేల్చుకుంటారనే తలంపుతోనూ..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఅదీగాక– కెనడా నుంచి వచ్చేశాక మళ్లీ జంటపత్రికలతో ముడిపడ్డానికి, అది కానప్పుడు ప్రధానస్రవంతిలో మళ్లీ జర్నలిస్టు జీవితాన్ని ఆవహింపజేసుకోడానికి ప్రయత్నాలు సాగించి, విసిగి వేసారి చివరికెలాగో ఆ జీవనాన్ని పొదువుకోడం ‘విపుల, చతుర– నేను’కు కొనసాగింపే, ఒక ముక్తాయింపే కనుక, దాన్నీ పరచడం కోసం.. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eఈ పొడిగింపై మీ ముందుకిలా.. మీ ముందిలా.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":46702628765833,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/download.png?v=1779095976"}],"url":"https:\/\/ajupublications.com\/collections\/new-releases.oembed","provider":"Aju Publications","version":"1.0","type":"link"}